Friday 24 February 2012

Windows 7, Vistaలలో “C” లాంగ్వేజ్ ఇలా బ్రహ్మాంఢంగా పనిచేస్తుంది..

95% మంది ఇంజనీరింగ్ స్టూడెంట్లు పాతకాలం Windows XPనే వాడుతుంటారు. అదేమంటే విండోస్ Vista, 7 ఆపరేటింగ్ సిస్టమ్ లలో C, C++ లు పనిచేయడం లేదని కంప్లయింట్లు చేస్తుంటారు. Windows 7లో “C” పనిచేయడం లేదనేది ఓ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా చేయాల్సిన కంప్లయింట్ కాదు. దానికి ఎన్నో సొల్యూషన్లు ఉన్నాయి. వాటన్నింటిలోకీ బెస్ట్ సొల్యూషన్ ని ఈ వీడియోలో పరిచయం చేస్తున్నాను. మీరు ఎలాంటి సెట్టింగులూ మార్చుకోవలసిన పనిలేదు. సింపుల్ గా ఈ వీడియోలో చూపించినట్లు చేయండి చాలు. ప్రతీ ఇంజనీరింగ్ విద్యార్థీ, బయట ఇనిస్టిట్యూట్ లలో C, C++ నేర్చుకునే ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా తెలుసుకోవలసిన టెక్నిక్ ఇది. ఆ ఏముందిలే.. “XPనే వాడేస్తే సరిపోతుంది కదా..” అని సరిపెట్టుకున్నారంటే ఎప్పటికప్పుడు డైనమిక్ గా ఉండే కంప్యూటర్ రంగంలో రాణించడం చాలా కష్టం. సో ఇప్పటికీ టెక్నికల్ గా వెనుకబాటుతనంలో ఉన్న ఎందరో విద్యార్థులకు ఉపయోగపడే ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి వారిని చైతన్యపరచగలరు.

డివిడి తయారీ కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయా?

ఈ ప్రశ్న చాలామంది నాకు వేశారు.. అందుకే ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఎందుకు అందరూ అలా ప్రశ్నిస్తున్నారంటే “మామూలు డివిడిలో 4.7 GB డేటా పట్టినప్పుడు Double Layer డివిడిలో దానికి రెట్టింపు డేటా అంటే 9.4 GB పట్టాలి కదా! మరి విచిత్రంగా కేవలం 8.5 GB డేటానే ఎందుకు పడుతోంది” అన్నది అందరి సందేహం. ఇది చదివాక మీకూ ఇదే డౌట్ వచ్చి ఉంటుంది. ఈ వీడియో చూస్తే మీ సందేహం ఇట్టే తీరిపోతుంది.

Thursday 23 February 2012

గూగుల్ బజ్, ప్రైవసీ సమస్యలు...

మైక్రోబ్లాగింగు మీద నా ఇంతకు ముందు టపా చదివే ఉంటారు. ఇప్పటికే అది బాగా ఊపందుకుందని మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎంతగా అంటే అన్ని సోషల్ నెట్వర్కింగ్ వెబ్‌సైటులూ దానిని ఏదో ఒక రూపంలో అమలు చేసేంతగా. ఉదా: ఫేస్‌బుక్ స్టేటస్ అప్‌డేట్‌లూ (What's on your mind ?), ఆర్కుట్ (what are you up to?) వగయిరా. బజ్ ఏమిటి ?
ఇది గూగుల్ నుంచి కొత్తగా వచ్చి చేరిన వెబ్‌ అప్లికేషను. సోషల్ నెట్వర్కింగూ, మెసేజింగూ కలిపి తయారు చేసిన ఉపకరణం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ట్విట్టర్, ఫ్రెండ్‌ఫీడ్ లోని విశేషాలను కలిపి తయారు చేసిన ఉపకరణం. జీ మెయిలులో భాగంగా దీనిని విడుదల చేసారు. ఈ ఉపకరణాన్ని మీరు పొందాలంటే మీ జీ మెయిలుకి వెళ్ళి వాడటమే. ఈ ఉపకరణం ద్వారా మీరు మీ ఫాలోయర్లకి మీ స్టేటస్ అప్‌డేట్లూ, మీ ఇతర సర్వీసుల (ఫ్లికర్, గూగుల్ రీడర్, ట్విట్టర్ వగయిరా) నుంచి అప్‌డేట్లూ అందరితో పంచుకోవచ్చు. ఇందులో మీరు ప్రచురిస్తున్న సమాచారం మీ గూగుల్ ప్రొఫైలు ద్వారా అందరికీ చూపించబడుతుంది. ఇందులోని స్నేహితుల కాన్సెప్టు ట్విట్టరు లాగానే. ఇతర జనాలు మిమ్మల్ని ఫాలో అవవచ్చు. మీరూ ఇతరులని ఫాలో అవవచ్చు. వారి నుంచి అప్‌డేట్లు మీకు బజ్ ద్వారా చూపించబడతాయి, అలాగే మీ నుంచి వారికీనూ. వారి అప్‌డేట్ల మీద వ్యాఖ్యలు చేసే సదుపాయం మీకుంటుంది. చర్చకి వీలుగా మీరు వారిని ఉద్దేశించడానికి @<వాడుకదారుని పేరు> వాడవచ్చు. బజ్ గురించి: జీ మెయిలులో అంతర్భాగంగా దీనిని విడుదల చేయడానికి అనేక కారణాలు ఉన్నా ముఖ్యమయినది ఏమీ శ్రమ లేకుండా మిలియన్ల కొద్దీ వాడుకదారులు వచ్చెయ్యడం. ఒక ఆర్కుటో, ఫేస్‌బుకో, ట్విట్టరో అయితే వాడుకదార్లు తమంతట తాముగా ఆ సర్వీసుకి సైనప్ చెయ్యవలసి ఉంటుంది. అయితే జీ మెయిలులో భాగంగా ఈ బజ్ ఉపకరణాన్ని చేర్చడం వల్ల మళ్ళీ వాడుకదార్లు సైనప్ చెయ్యకుండా ఆటోమేటిగ్గా వారిని బజ్ వాడుకదార్లుగా మార్చివేసింది. అదీనూ వాడుకదారులకి మీరు బజ్ ఉపయోగించాలనుకుంటున్నారా ? అని అడగకుండా బజ్ ఉపయోగించవద్దనుకుంటున్నారా ? అనే ప్రశ్నని మాత్రమే అడిగింది గూగుల్. అంటే ఆప్ట్ ఇన్ మదులు ఆప్ట్ అవుట్ అన్నమాట. దీని వల్ల వాడుకదార్లకి అసలు నిర్ణయించుకునే హక్కునే ఇవ్వలేదు. అదీ కాక ఆప్ట్ అవుట్ ఆప్షన్ మొదట్లో అంత సులభంగా కనుక్కోలేకుండా ఉంచింది. దీని వల్ల ఏమయిందంటే గూగుల్ అనే క్రేజ్ బట్టి కొంత, ఎలాగూ వచ్చి చేరింది కదా వాడితే పోలా అని కొంత జనాలు దీనిని ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇక విడిగా ఉపకరణం విషయానికొస్తే ఇది కొత్త ఆలోచనేమీ కాదు. ట్విట్టర్‌లో మాదిరిగా స్టేటస్ అప్‌డేట్లూ, ఫ్రెండ్‌ఫీడ్ మాదిరిగా వివిధ ఇతర ఉపకరణాల నుంచి సేకరించిన తాజీకరణలూ కలిపితే వచ్చిందే బజ్. అయితే మీ మెయిలు బాక్సులో ఉంచడం వల్ల మీరు మెయిళ్ళు చదవగానే, ఆ కిందే ఉన్న బజ్‌లో చూపించే చదవని బజ్ సంఖ్యని చూసి దాని వైపూ దృష్టి సారిస్తారు. అలా వాడటం అలవాటు చేసింది గూగుల్. ఇది తప్పని కాదు, ఇది వీరి స్ట్రాటజీ. (ఆదరణ పొందిన తరువాత బజ్ విడిగా ఒక ఉపకరణంగా రూపొందుతందని నాకు బలంగా అనిపిస్తుంది. ఈ స్ట్రాటజీ కేవలం వాడుకదారులని పొందటానికి ఉద్దేశించినది మాత్రమే అని నా అభిప్రాయం.) బజ్‌లో ప్రైవసీ సమస్యలు: అయితే ఈ ఉపకరణం విడుదలలో గూగుల్ చాలా పొరపాట్లు కూడా చేసింది. అన్నిటి కన్నా ముఖ్యమయినది ప్రైవసీని అంతగా పట్టించుకోకపోవడం. ౧. బజ్‌లో మీరు ఎంచుకోకుండానే ఆటోమేటిగ్గా మీకు ఫాలోయర్లు వచ్చి చేరుతారు. వీరెవరంటే మీరు జీ మెయిలులో తరచూ మెయిల్ చేసే వాళ్ళూ, జీ టాక్‌లో తరచూ చాట్ చేసేవాళ్ళూ అన్నమాట. మీ అనుమతి లేకుండా వారందరినీ మీ ఫాలోయర్లుగా చేర్చేసింది గూగుల్. మీరు కావాలనుకోకపోయినా మిమ్మల్నీ వేరేవారికి ఫాలోయర్లుగా మార్చివేసింది. ఇది పెద్ద బ్లండర్. ఎందుకంటే ఆన్‌లైనులో మీరు చేసే కార్యకలాపాలను ఎవరితో పంచుకోవలనేది ఎప్పటికీ మీరే నిర్ణయించుకోవాలి కానీ ఏ ఇతర ఉపకరణమూ కాదు. ఇదే కాకుండా మీరు ఎవరికి ఎక్కువగా మెయిల్ చేస్తారు, ఎవరితో ఎక్కువగా మాట్లాడతారు అనే విషయాన్ని అందరికీ తేటతెల్లం చేసింది. ఎందుకంటే మీకు గూగుల్ ప్రొఫైలు ఉంటే దాంట్లో మీ ఫాలోయర్ల వివరాలు చూపించబడతాయి. దీనిని ఇప్పుడు సరి చేసింది గూగుల్. ఇప్పుడు ఆటోమేటిగ్గా ఫాలోయర్లుగా మార్చకుండా కేవలం సజెషన్‌గా మాత్రమే చూపిస్తుంది. అదీ కాక ఇప్పుడు మీ గూగుల్ ప్రొఫయిలు నుంచి ఫాలోయర్ల వివరాలని దాచేలా ఆప్షన్ ఇచ్చింది. ౨. బజ్‌ని గనుక మీరు మీ మొబైలు/స్మార్ట్‌ ఫోను నుంచి వాడుతుంటే అది మీ ప్రదేశాన్ని ఆటోమేటిగ్గా అప్‌డేట్ చేసే అవకాశం ఉంది. గూగుల్ మొబైల్ అప్లికేషను మీ మొబైలు ద్వారా మీరు ప్రస్తుతం ఉన్న ప్రదేశం వివరాలను మీ బజ్ ద్వారా ఇతరులకి చేరవెయ్యచ్చు. మీకు ఈ అమరికని మార్చుకునే సదుపాయం ఉంది కానీ పొరపాటున ఇది కనుక చేతనం చెయ్యబడి ఉంటే ఇది పెద్ద ప్రైవసీ సమస్యే. ౩. బజ్ మీ జీ మెయిలు అకౌంట్‌తో జోడించబడి ఉంది కాబట్టి దాని అవసరాలకి జీ మెయిలు ఐడెంటిటీని వాడుకుంటుంది. ఈ పద్ధతి కొన్ని సమస్యలు తెస్తుంది. ఒకవేళ మీరు బజ్ ద్వారా ఎవరికయినా రిప్లై ఇస్తున్నారనుకోండి మీరు దానిని @<వాడుకదారుని చిరునామా> పద్ధతిలో ఇవ్వవచ్చు. బజ్ ఆటోమేటిగ్గా ఆ వాడుకదారు పేరుని మీకు సూచిస్తుంది. అయితే ఆ వాడుకదారునికి గనుక గూగుల్ ప్రొఫైలు లేకపోతే జీ మెయిలు అడ్రసు ప్రచురించబడుతుంది. దాని ద్వారా ప్రపంచమంతటికీ ఆ జీ మెయిలు అడ్రసు ఇచ్చినట్టే, ఎందుకంటే మీ బజ్‌లన్నీ మీ గూగుల్ ప్రొఫైలులో చూపించబడతాయి. మీ ప్రొఫైలు గనుక బహిరంగమైనది అయితే ఎవరయినా ఆ జీ మెయిలు అడ్రసు చూడగలరు. దీనిని కూడా గూగుల్ ఇప్పుడు సరి చేసినట్టుంది.

తొక్కలో విండోస్ (విస్తా)

మొన్నమధ్య ఏదో సమస్యొచ్చి, కొత్త హార్డ్ డ్రైవ్ వేసి విస్తా ఇన్స్టాల్ చేసాను. ఆరు నెలలు అయ్యిందనుకుందాం. ఈ కొత్త హార్డ్ డ్రైవ్ రెండు టెరాబైట్లు. రెండొందల జిబి పక్కన పెట్టా. 1.8 టెరాబైట్ మిగిలింది. విండోస్ విస్తా వేసా అందులో. బాగనే ఉంది. హాం౨డీ డాం౨డీగా పని చేస్తున్నది. బాగనే ఉంది. ఇంకో పార్టీషన్ చేయాల్సొచ్చింది. సి డ్రైవ్ సైజు చూసి షాక్ అయ్యా. 1.47 TB Avaliable from 1.79 TB అంటుంది. హా?? అంటే దాదాపు మూడొందల డెబ్భై జిబి గయా???? ఎక్కడకి పోయిందీ? కొన్ని డిస్క్ యుటిలిటీస్ వేసి చూసాను. ఉదాహరణకి, యూనిక్సులో డియు అని ఒక కమాండు. విండోసులో కూడా థర్డ్ పార్టీ దొరుకుతుంది. అది వేసి చూస్తే, సి డ్రైవులో యూజ్డ్ డిస్క్ స్పేస్ కేవలం ఎనభైఒక్క జిబి మాత్రమే వాడినట్లు చూపుతున్నది.
ఈ ఓపెన్ సోర్స్ టూల్ ఉంది. విన్‌డిఐఆర్‌స్టాట్ అని. అది మొత్తం స్టాటిస్టిక్స్ చూపుతుంది. రూట్ నుండి ఏఏ డైరెక్టరీలు ఎంతెంత ఆక్యుపై చేసాయీ అని. డెభై+ జిబీ సి డ్రైవు అని చెప్పింది.
కానీ, సి డ్రైవ్ మీద రైటు క్లిక్కు కొట్టి ప్రాపర్టీస్ చూస్తే, 342 GB యూజ్డ్ స్పేస్ అని చూపుతున్నది.
విండోస్ ఎక్స్‌పి నుండి మై*క్రో*సాఫ్ట్ వాడు షాడోకాపీ అని ఓ కాన్సెప్టు తెచ్చాడు. http://en.wikipedia.org/wiki/Shadow_Copy ఏందయ్యా అంటే స్నాప్‌షాట్ అన్నమాట Shadow Copy (Volume Snapshot Service or Volume Shadow Copy Service or VSS), is a technology included in Microsoft Windows that allows taking manual or automatic backup copies or snapshots of data, even if it has a lock, on a specific volume at a specific point in time over regular intervals. It is implemented as a Windows service called the Volume Shadow Copy service. A software VSS provider service is also included as part of Windows to be used by Windows applications. Shadow Copy technology requires the file system to be NTFS to be able to create and store shadow copies. Shadow Copies can be created on local and external (removable or network) volumes by any Windows component that uses this technology, such as when creating a scheduled Windows Backup or automatic System Restore point. vssadmin list shadows అని కొడితే లిస్ట్ చూపెడుతుంది. నా లాప్ టాప్ లో కేవలం రెంటి లిస్ట్ చూపెడితే నా డేస్క్ టాపులో, అంటే పై గోల నడుస్తున్న బాక్సులో ముప్ఫైకి పైగా చూపుతున్నది. అవి ఏవన్నా స్పేస్ ఆక్యుపై చేస్తున్నయా? దీనయ్య విండోస్. మా సోదరుని లాగా, నేనూ తొందర్లో మా౨క్ ఓయస్సుకి మారితే బెటరని ఘాట్టిగా నిర్ణయించాను

అతి పెద్ద స్క్రీన్ కలిగిన తాజా ఫోన్

ఇప్పటివరకూ ఏ మొబైల్ ఫోనూ కలిగి ఉండనంత పెద్ద సైజ్ లో 5.3 అంగుళాల స్క్రీన్ సైజ్ కలిగిన ఈ ఫోన్ తాజా సంచలనం. కేవలం స్క్రీన్ సైజే కాదు Super AMOLED డిస్ ప్లే, పగిలిపోని చెక్కుచెదరని గొరిల్లా గ్లాస్ స్క్రీన్, S-Pen అనే సరికొత్త ఏర్పాటూ.. చెప్పుకుంటూ పోతే నేను ఈ వీడియోలో వివరంగా చూపించిన Samsung Galaxy Note అన్నీ ప్రత్యేకతలే. దీని గొప్పదనం క్రింద మీరే స్వయంగా చూసేయండి.

మీ హార్డ్ డిస్క్ ఎప్పుడైనా ఫెయిలైపోవచ్చు.. నమ్మలేకపోతున్నారా? ఇది చూడండి

ఆ ఒక్క ఫైల్ లో మీ జీవితం ముడిపడి ఉందనుకుందాం.. లేదా ఎన్నో గంటలు కష్టపడి ఆ ఫైల్ ని తయారు చేసుకున్నారనుకుందాం. ఓ ఫైన్ మార్నింగ్ అవసరం పడి ఆ ఫైల్ ని ఓపెన్ చేయబోతే File Corrupted.. మాదిరి మెసేజ్ వస్తే ఎంత బాధగా ఉంటుంది? ఇప్పటివరకూ మీకు ఇలాంటి సమస్యలేమీ రాకపోయినా మున్ముందు ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోతే ఫైళ్లు కరప్ట్ అవడం చాలా మామూలు విషయం. అది మీ రెజ్యూమ్ కావచ్చు, ఫొటో కావచ్చు, నెట్ నుండి డౌన్ లోడ్ చేసుకున్న ఫైల్ కావచ్చు.. ఎందుకు కరప్ట్ అవుతుంది అన్నది చాలా వివరంగా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో చూస్తే File corruptionపై మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఇకపై జాగ్రత్తగా ఉండొచ్చు.

ఇప్పటికీ విండోస్ ఇన్ స్టాల్ చేయడం మీకు రాదా? ఇతరులపై ఆధారపడుతున్నారా? ఇక్కడ నేర్చుకోండి

కంప్యూటర్ స్లో అవడం వల్లనో, వైరస్ వల్లనో చీటికీ మాటికీ విండోస్ ని ఫ్రెష్ గా ఇన్ స్టాల్ చేయవలసి వస్తే.. దాని కోసం ప్రతీసారీ ఇంట్లో ఉన్న చదువుకున్న పిల్లల మీదనో, ఆ చదువుకున్న పిల్లలకు తెలియకపోతే హార్డ్ వేర్ టెక్నీషియన్ ని వెదికి 200, 300 సమర్పించుకుని ఇన్ స్టాల్ చేయించుకోవడం ఎంత ఇబ్బందో ఆలోచించండి. విండోస్ ని ఇన్ స్టాల్ చేయడం అన్నది చాలా చాలా చిన్న విషయం. ఎంత చిన్న విషయమో ఈ వీడియోలో నేను ప్రాక్టికల్ గా ప్రతీ స్టెప్ నీ చూపిస్తున్నాను, ఈ వీడియో చూశారంటే ఇక ఎవరి సహాయం మీరు తీసుకోరు, మీకు మీరే విండోస్ ని install చేసుకోగలుగుతారు.

మీకు తెలియకుండానే మీ పిసిలో అత్యంత ప్రమాదకరమైన రూట్ కిట్ లు ఉండొచ్చు

ఒక సగటు కంప్యూటర్ యూజర్ భద్రత మీద చాలా తక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. కంప్యూటర్లో మనకు తెలియకుండానే ఎన్ని ప్రమాదాలు జరిగిపోతున్నా గమనించకపోవడం అన్నది ఎంత దారుణమైన పరిస్థితో ఆలోచించండి. అందరూ వైరస్ అనే పదాన్ని వింటూనే ఉంటారు కానీ అంతకన్నా rootkitలు మరింత ప్రమాదకరమైనవి, అస్సలు అవి కొన్ని ఉన్నాయని తెలుసుకోరు. అలాగే కీజెన్ లు, ప్యాచ్ లూ, లోడర్ల ద్వారా పైరేటెడ్ సాఫ్ట్ వేర్ వాడుతూ కూడా.. తమ ఏంటీవైరస్ సాఫ్ట్ వేర్ వాటిలో వైరస్ చూపించడం లేదు కాబట్టి అవన్నీ క్లీన్ గా ఉంటాయని నమ్ముతూ ఉంటారు. ఈ నేపధ్యంలో కీజెన్ ల వంటి వాటని క్రిప్ట్ చేసి మన పిసిలో ఎలా ప్రవేశపెడతారు వంటి విషయాల్నీ ఈ వీడియోలో ప్రస్తావించాను. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూడండి.

కొన్ని వెబ్ సైట్లు మీ కంప్యూటర్లో ఓపెన్ అవకుండా బ్లాక్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి..


కొన్ని కారణాల వల్ల మనం కొన్ని వెబ్ సైట్లు మన కంప్యూటర్లో ఓపెన్ అవకుండా నిలిపివేయాలనుకోవచ్చు. అయితే ఇలా బ్లాక్ చేయడం ఎలాగో తెలియక చాలామంది హోమ్ పిసి యూజర్లు తంటాలు పడుతుంటారు. ఇదంత కష్టమైన విషయమేమీ కాదు. ఈ వీడియో చూశారంటే 5 నిముషాల్లో మీరు మీ కంప్యూటర్లోనూ అవసరం లేని వెబ్ సైట్లు ఇకపై లోడ్ అవకుండా బ్లాక్ చేయగలుగుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలు గంటల తరబడి ఆన్ లైన్ గేమ్ లకు అతుక్కుపోతుంటే, లేదా సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ, ఛాటింగ్ లోనూ కాలం గడుపుతుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. స్పీకర్లు ఆన్ చేసుకుని వింటూ చూసేయండి మరి.